mt_logo

నిజామాబాద్ లో దూసుకుపోతున్న కారు!!.

నిజామాబాద్ జిల్లా జుక్కల్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభకు భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాకూడా సంపూర్ణ తెలంగాణ రాలేదని, 14సంవత్సరాల పోరాటం, అమరవీరుల బలిదానం, లాఠీలు, తూటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. గతంలో కొందరు పెద్దలు చేసిన పొరపాట్ల ఫలితంగా 60 ఏళ్ళు బాధపడ్డాం. ఎవరి చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంటుందో తేల్చుకుని ప్రజలు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రం కలిసిఉన్నప్పుడు నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో మోసపోయామని, మళ్ళీ ఏమన్నా కిందపడితే 50ఏళ్ళు బాధపడతామని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

పొన్నాల భూకబ్జాదారుడని, 1971లో దళితులకిచ్చిన 14 ఎకరాల భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్నదని, గవర్నర్ చొరవ తీసుకుని పొన్నాలను అరెస్టు చేయాలని, తక్షణమే పొన్నాల పీసీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత నరేంద్రమోడీ ఒకపక్క చంద్రబాబును, మరోపక్క పవన్ బాబును వెంటపెట్టుకుని తెలంగాణలో తిరుగుతున్నాడు. మోడీ నీ బతుకు ఇంక కన్నీళ్ళేనని ఎద్దేవా చేశారు.

అనంతరం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సభకు హాజరైన భారీజనసందోహాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ తలరాతను మార్చేవి ఇప్పుడు జరిగే ఎన్నికలని, ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, ఈ సారి పొరపాటు చేస్తే సరిదిద్దుకోలేమని అన్నారు. కరెంటు బాధలు, నీళ్ళ బాధలు, వలస బతుకులతో తెలంగాణ అల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

బాబు పరిరక్షకుడని, మోడీ సూపర్ పరిరక్షకుడని అన్నారు. ప్రతి ఒక్కడు కేసీఆర్ ను విమర్శించుడే. పొన్నాల, చంద్రబాబు, మోడీ, పవన్ లాంటి వాళ్ళందరూ కేసీఆర్ పై పడ్డారు. వీళ్ళ బాధల్లా ఒక్కటే. టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు. తెలంగాణ అస్థిత్వమైన టీఆర్ఎస్ పార్టీ ఎంత చిక్కబడితే వాళ్లకు అంత భయం. ఎక్కడ తెలంగాణపై తమకు అధికారం పోతుందో అని. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కబ్జా చేసిన భూములన్నిట్నీ వెనక్కు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *