తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు..

  • February 8, 2019 6:01 pm

ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో తెలంగాణ విజయ డెయిరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది. టీఎస్ డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్య ఈ అవార్డును కేంద్రమంత్రి అశ్విని చౌబే చేతులమీదుగా అందుకున్నారు.

20 కేటగిరీల్లో ఐఎఫ్ఎస్ఎస్ అవార్డులను అందించింది. సాంఘిక సంక్షేమ పాఠశాలలు, అంగన్ వాడీలకు స్వచ్చమైన పాలను అందిస్తున్నందుకుతెలంగాణ విజయ డెయిరీకి అవార్డు దక్కింది. ఈ సందర్భంగా టీఎస్ డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విజయ డెయిరీ సమర్ధత, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు, మేము విజయవంతం అయ్యామనడానికి ఈ అవార్డు నిదర్శనం అని అన్నారు. స్వచ్చమైన పాలను సరసమైన ధరలకు అందిస్తున్నాం. బాలింతలు సైతం తమ పిల్లలకు తెలంగాణ విజయ డెయిరీ పాలను పట్టిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు.


Connect with us

Videos

MORE