లక్షమందికి పైగా దళిత యువతకు లబ్ధి..

  • February 12, 2019 1:43 pm

దళిత వర్గాలు ఆర్ధికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధానమని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఇందుకు అనుగుణంగా దళిత యువత ఆర్ధికప్రగతికి పెద్దఎత్తున సబ్సిడీ రుణాలు అందిస్తున్నది. మరోవైపు నైపుణ్యం కలిగిన ఎస్సీ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తున్నది. వెయ్యి కోట్ల సబ్సిడీ రుణాలు ఇచ్చి లక్షమందికి పైగా యువతకు లబ్ధి చేకూర్చడం చూస్తే ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దళిత యువతకు అందిస్తున్న ప్రోత్సాహానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

2014-15 ఆర్ధిక సంవత్సరం నుండి 2017-18 ఆర్ధిక సంవత్సరం వరకు 1,04,018 మందికి వివిధ రంగాల్లో స్థిరపడేందుకు ఎస్సీ కార్పొరేషన్ రూ.1,123.41 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేసింది. సమైక్య రాష్ట్రంలో కేవలం రూ. లక్షలోపు రుణాలను అందజేయగా తెలంగాణ సర్కార్ 2015-16 ఆర్ధిక సంవత్సరం నుండి స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చే సబ్సిడీ రుణాల మొత్తం రూ. 5 లక్షలు చేసింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో దానిని ఏకంగా రూ. 12 లక్షల వరకు పెంచింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేస్తారు. రూ. లక్ష నుండి రూ. 2 లక్షల వరకు 70%, రూ. 2 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు ఉపాధి రుణం పొందేవారికి 60 సబ్సిడీని అందజేస్తూ దళిత యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిజమైన లబ్దిదారులకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నామని, తెలంగాణ ఏర్పడిన నాటినుండి ప్రతి ఏటా పెండింగ్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాం భూక్యా తెలిపారు.

 


Connect with us

Videos

MORE