mt_logo

మిషన్ కాకతీయలో ప్రజలంతా భాగస్వాములు కావాలి – హరీష్ రావు

రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో మిషన్ కాకతీయపై జరిగిన సమీక్షాసమావేశంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ, మిషన్ కాకతీయలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, సమైక్య పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. కలిసికట్టుగా పని చేస్తేనే రైతులకు లబ్ధి చేకూరుతుందని, కాకతీయుల స్ఫూర్తిగా మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టామని హరీష్ పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో పెద్దగా అభివృద్ధి జరగలేదని, సమైక్య పాలనలో జిల్లాలోని భూములను కబ్జా చేశారని, గతంలో 4 జిల్లాలకు కలిపి ఒక ఎస్ఈ ఉన్నాడని, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకొక ఎస్ఈని నియమించామన్నారు. టెండర్లను 15 రోజుల్లో పూర్తి చేయాలని, అధికారులకే పూర్తి అధికారం ఇచ్చామని, ఈ ప్రొక్యూర్ మెంట్ విధానంలోనే పనులు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు అందరూ చెరువుల లిస్టును తయారు చేయాలని, కట్ట, తూము, అలుగులను బాగుచేయాలన్నారు. చెరువులు నిండితే బావులు, బోర్లలో నీళ్ళు బాగా వస్తాయని, మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని హరీష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *