mt_logo

నిజాంసాగర్ కాలువలలో నీటి విడుదల, పొలాలకు సరఫరాను పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం

స్వయంగా జీపు నడుపుతూ నిజాంసాగర్ కాలువలలో నీటి విడుదల, పొలాలకు సరఫరాను పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి.

నిజాంసాగర్ ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థల ద్వారా పొలాలకు అందుతున్న నీటిని మంత్రి పొచారం ఈ రోజు మరోసారి పరిశీలించారు. స్వయంగా జీపు నడుపుకుంటూ నసరుల్లాబాద్ మండల పరిదిలోని పొలాలను మంత్రి పొచారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడుతూ పొలాలన్నింటికీ నీరు అందుతుందా అని అడిగారు. నీళ్ళు పుష్కలంగా వస్తున్నాయని, ప్రస్తుతం సాగులో ఉన్న పొలాలకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

పొలాలను రక్షించడానికి నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా విడుదల చేసినందుకు ప్రభుత్వానికి, మంత్రి పొచారంకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ… ఈ ఏడాది వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులోని రైతాంగం బోర్లు, బావులు, చెరువులు, వాగులలోని నీటిపై ఆదారపడి వరి నాట్లు వేశారు.

నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగుచేశారు. పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో, పాలు పోసుకునే దశలో ఉండటంతో నీటి అవసరం ఎక్కువగా ఉన్నది. ప్రస్తుత పరిస్థితులలో నిజాంసాగర్ కాలువల ద్వారా కొంత నీటిని అందించినట్లయితే పంటలు బయటపడతాయని రైతుల విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనుమతితో నిన్న ఉదయం నుండి నీటి విడుదల ప్రారంభించాం. ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేశాం. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 2 TMC ల నీరుంది.

రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం మొదటి విడతగా పది రోజులు నీటి సరఫరా జరుగుతుంది. ఈ నెల 24 వరకు మొదటి విడత ఇస్తాం. వారం రోజులు నిలిపివేసి తదుపరి మరో తడి అక్టోబర్ 1 నుండి 10 వరకు అందిస్తాం. చివరి ఎకరం వరకూ నీటిని అందిస్తాం. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ రైతులకు అందిస్తాం. రైతులు కూడా అధికారులకు సహకరిస్తూ నీరు వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *