mt_logo

లండన్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ “తెలంగాణ డిప్యూటీ సీఎం – మహమూద్ అలీ”

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ – యూకే మరియు హైదరాబాద్ అసోసియేషన్ యూకే సంయుక్తంగా లండన్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ “తెలంగాణ డిప్యూటీ సీఎం – మహమూద్ అలీ ” ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ల్యామ్‌బెత్ మేయర్ సాలేహా జాఫర్, మాజీ హౌన్‌స్లా మేయర్ నసీర్ మాలిక్ అథిదులుగా హాజరయ్యారు. యూకే నలుమూలల నుండి భారీగా వివిద సంస్థల ప్రతినిదులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి మరియు హైదరాబాద్ అసోసియేషన్ యూకే ఉపాధ్యక్షులు షా-నవాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, ప్రో. జయశంకర్ గారికి నివాళులర్పించి, ప్రారంభించారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో టీ.అర్.ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి రెవెన్యూ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా పనిచేస్తోందని, సాక్షాత్తూ ప్రదాని మోడి గారు, ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రశంసించారని తెలిపారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై ల కోసం ప్రత్యేకమైన “ఎన్నారై పాలిసి” తీసుకొస్తుందని, ఏదైన సలహాలు సూచనలు ఉంటే, మంత్రి కేటి. రామారావు గారికి తెలుపలాని కోరారు.

గత రెండు సంవత్సారాల టీ.ఆర్.ఎస్ ప్రభుత్వ విదానలను, భవిష్యత్తులో బంగారు తెలంగాణకై వారి ప్రణాళికలను సభకు క్లుప్తంగా వివరించారు.

యూకేలో మొట్టమొదటి సారి అన్ని సంస్థలను ఒక్క వేదిక పైకి తెచ్చి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై టీ.ఆర్.ఎస్ ని, ముఖ్యంగా అధ్యక్షులు అనిల్ కూర్మాచలంని ప్రత్యేకించి అభినందించారు. చివరిగా హాజరైన ప్రతి తెలంగాణ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నారై టీ.అర్.ఎస్ తో మొదలు కొని హైదరాబాద్ అసోసియేషన్, తెలంగాణ జాగృతి, జె.టి.ఆర్.డి.సి, టెకా, టి.డి.ఎఫ్, టి.ఎన్.ఎఫ్ అధ్యక్షులు వారి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని సభకు వివరించారు.

ఎన్నారై టీ.అర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టీ.అర్.ఎస్ సెల్ కి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు మరియు యావత్ టీ.అర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సభ్యలు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారిని సన్మానించి – జ్ఞాపిక బహూకరించారు.

మహమూద్ అలీ గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమంలో ఎన్నారై టీ.అర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యూకే ఇంచార్జ్ విక్రం రెడ్డి, శ్రీధర్ రావు, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, మధుసూధన్ రెడ్డి, సృజన్ రెడ్డి చాడా, మల్లా రెడ్డి, శ్రీకాంత్, సత్య, సత్యం రెడ్డి కంది, చిత్తరన్జన్ రెడ్డి, ఐటీ జాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు ముజీబ్, ఉపాధ్యక్షులు షా-నవాజ్, ప్రధాన కార్యదర్శి సమి, టి.డి.ఎఫ్ అధ్యక్షుడు రామ రావు, జె.టి.ఆర్.డి.సి అధ్యక్షుడు సృజన్ రెడ్డి, టి.ఈ.ఎన్.ఎఫ్ అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్, టేకా అధ్యక్షుడు శేషేంద్ర, తెలంగాణ జాగృతి అధ్యక్షులు సంపత్ మరియు తెలంగాణ జాగృతి, జె.టి.ఆర్.డి.సి, టెకా, టి.డి.ఎఫ్, టి.ఎన్.ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *