mt_logo

MYTA ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి గారు మూడు రోజుల పర్యటనలో భాగంగా మలేషియాలోని వివిధ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి క్షేత్రాలను మరియు వివిధ రకాల పంటలు సాగు చేసే క్షేత్రాలను సందర్శించి వ్యవసాయములో మలేషియా వాసులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను తెలుసుకున్నారు. చివరి రోజున మలేషియా కౌలాలంపూర్ లోని లిటిల్ ఇండియాలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ మంత్రి గారికి విందును ఏర్పాటు చేసింది.

ఎంతో బిజీగా ఉన్నపటికీ తెలంగాణ ప్రవాసులను కలుసుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి మలేషియా తెలంగాణ ప్రెసిడెంట్ సైదం తిరుపతి గారు కృతఙ్ఞతలు తెలియజేసారు. అదే విధంగా NRI పాలసీ రూపకల్పనకు కృషిచేయాల్సిందిగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరపున కోరారు. మైటా గత ఆరు సంవత్సరాలు చేసిన ముఖ్య కార్యక్రమాలను మరియు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలను గురించి మంత్రి గారికి వివరించారు. మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ చోపరి సత్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి యూత్ ప్రెసిడెంట్ కార్తీక్ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ మొదట ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను అయన అభినందించారు అలాగే తెలంగాణలో కూడా విదేశాలకు వెళ్లాలని అనుకునే యువతకు అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా మైటాను అయన కోరారు. తెలంగాణ బిడ్డలందరు గర్వపడేటట్లు తెలంగాణ మంత్రులంతా ఉమ్మడి బాధ్యత తీసుకొని కెసిఆర్ గారి నాయకత్వాన తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *