కువైట్ టీఆర్‌ఎస్ కమిటీ ఏర్పాటు..

  • February 11, 2019 3:44 pm

టీఆర్‌ఎస్ కువైట్ పూర్తిస్థాయి కమిటీని ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం ప్రకటించారు. కువైట్ తాత్కాలిక కమిటీ ఇన్నాళ్లూ నిర్వహించిన పార్టీ కార్యక్రమాలను ఆయన అభినందించారు. మిషన్ కాల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సలహాదారు, ఎంపీ కవిత సూచనలమేరకు గల్ఫ్‌లోని మిగతా దేశాల్లో పార్టీ శాఖలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కువైట్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా మహ్మద్ అబ్దుల్ అసద్ అలీం, అధ్యక్షుడిగా అభిలాష గొడిశాల, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజిజ్, ప్రమోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా రవి గన్నరపు, రమేశ్ ఓరగంటి, మైనార్టీ ఇంచార్జిగా ఎండీ సుభాన్ సొహైల్, షేక్ జమీల్, మహిళా ఇంచార్జిగా దివ్య గారిణే, ఆర్గనైజింగ్ ఇంచార్జిగా రవి సుధగాని, గిరీశ్ ఈసిగిరి, కల్చరల్ ఇంచార్జిగా జగదీశ్ సాయికుమార్ ఉప్పల, గోపాల్ నాసుపురి, మీడియా ఇంచార్జిగా రాజు మంచాల, యూత్ ఇంచార్జిగా రత్నకుమార్ మామిడాల, హరీశ్ మోడం, సలహా కమిటీకి జీకే గంగాధర్, అనిత గార్లపాటిలను నియమించారు.


Connect with us

Videos

MORE