mt_logo

క్రిమినల్ చర్యలు తీసుకుంటా- విఠల్

ఉద్యోగుల విభజన విషయంలో సీమాంధ్ర ఉన్నతాధికారుల అహంకారధోరణి మరోసారి బయటపడింది. తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకుడు సీ. విఠల్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డులో సీనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తుండగా, ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. 52శాతం మంది ఉద్యోగులను సీమాంధ్ర ప్రభుత్వానికి పంపే నిబంధనలో భాగంగా ఆయనను సీమాంధ్రకు కేటాయించారు. నిజానికి విఠల్ మెదక్ జిల్లా వాసి. పుట్టుపూర్వోత్తరాలతోసహా సర్వీస్ బుక్ లో నమోదు చేయబడింది. ఏ నిబంధనల ప్రకారం చూసుకున్నా ఆయనను తెలంగాణ ప్రభుత్వానికే కేటాయించాలి.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విఠల్ ను కావాలనే సీమాంధ్రకు కేటాయించడంపట్ల తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఏ నిష్పత్తిలో ఇంటర్ యాజమాన్యం ఉద్యోగులను పంపిణీ చేసిందో తెలపాలని ఉద్యోగసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆయన దీనికి సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు.

మరోవైపు ఇంటర్ బోర్డులో ఉద్యోగులపంపిణీలో అనుసరించిన విధానంపై క్రిమినలు చర్యలు తీసుకుంటానని, బోర్డులోని ఉన్నతాధికారులు, సీమాంధ్ర ఉద్యోగులు తనను కుట్రపూరితంగానే సీమాంధ్రకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని విఠల్ ఆరోపించారు. జూన్2 తర్వాత రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజనను పరిశీలించి ఆ తర్వాత సరైన రీతిలో స్పందిస్తానని, ఈ విషయంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన వార్ రూమ్ సమస్యలను పరిష్కరిస్తుందని అభిప్రాయాన్ని విఠల్ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *