mt_logo

తెలంగాణ రాష్ట్రంలో తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఈటెల..

రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 315 మంది పబ్లిషర్స్ ఈ ప్రదర్శనలో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషలకు సంబంధించిన పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా తెలంగాణ అస్థిత్వాన్ని చాటిచెప్పే పుస్తకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ప్రదర్శన ప్రారంభమైన తొలిరోజే వేలాదిమంది సాహితీ ప్రియులు హాజరై సందడి చేశారు. ప్రదర్శన జరిగే ప్రాంగణానికి కాళోజీ పేరును, వేదికకు వట్టికోట ఆళ్వారుస్వామి పేరును పెట్టారు. ఈ పుస్తక ప్రదర్శన ఈనెల 26 వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ పదిరోజులూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్షులు గౌరీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *