ఓటరు లిస్టులో పేరు లేకున్నా ఈ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు..

  • March 12, 2019 2:18 pm

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళితే ఓటరు లిస్టులో మీ పేరు లేదా? తాజాగా ప్రకటించిన ఓటరు లిస్టులో కూడా మీ పేరు గల్లంతయ్యిందా? అయినా ఏమీ కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు వేయొచ్చు. ఎవరైతే మార్చి 15 తేదీలోపు ఫామ్ 6 లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు ఓటరు లిస్టులోని చేర్పుల జాబితాలో చేరుస్తారు. ఇందుకోసం ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోండి.

అసెంబ్లీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓటు వేశాం కదా.. లోక్ సభ ఎన్నికల్లో ఓటరు లిస్టులో పేరు ఉంటుందిలే అని నిశ్చింతగా ఉండకండి. మీ పేరు ఓటరు లిస్టులో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. మీ వద్ద ఓటరు గుర్తింపు కార్డ్ ఉన్నంత మాత్రాన ఓటరు లిస్టులో పేరు ఉన్నట్లు కాదు. నా ఓటు యాప్, ఓటరు హెల్ప్ లైన్ నంబర్ 1950, వాదా యాప్ ద్వారా ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి. పేరు లేకుంటే ఈ రోజే నమోదు చేసుకోండి.


Connect with us

Videos

MORE