mt_logo

బిగ్ బ్రేకింగ్: ప్రొఫెసర్ కోదండరాంకు చంద్ర బాబు ఫోన్. పొత్తుకు మధ్యవర్తిత్వం!

తెలంగాణలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు విచ్చిన్నం అయ్యే లక్షణాలు కనిపిస్తుండటంతో ఇక లాభం లేదనుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగప్రవేశం చేశారు. పొత్తులో కీలక భాగస్వామిగా ఉన్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు చంద్రబాబు ఫోన్ చేశారు. పొత్తు ముందుకుసాగడానికి ఉభయకుశలోపరి ఉపాయం ఆయన చెవిలో ఊదారు.

కనీసం 8-9 సీట్లు ఇస్తే కానీ టీజేఎస్ పొత్తుకు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం 3-4 సీట్లకు మించి విదిల్చే పరిస్థితి లేదు. దీంతో టీజేఎస్ కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పి బీజేపీ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని స్వయంగా టీజేఎస్ నాయకులే మీడియాకు లీకులు ఇస్తూ వస్తున్నారు. మహాకూటమి పొత్తు వికటిస్తే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది ఓటుకు నోటు కేసు సూత్రధారి చంద్రబాబే కావడంతో, ఇక లాభం లేదనుకుని స్వయంగా ఆంధ్రా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు ఇచ్చిన ఫార్ములా ప్రకారం కాంగ్రెస్ 8-9 సీట్లకు ఒప్పుకుంటుంది. కానీ ఒక నాలుగు సీట్లు టీజేఎస్ అడిగినవి కాగా మిగతా 4 సీట్లు పాతబస్తీలో ఉంటాయట. ఈ ఫార్ములా ప్రకారం ఎలాగూ మజ్లీస్ గెలిచే 4 సీట్లను పొత్తులో భాగంగా టీజేఎస్ కు కాంగ్రెస్ వదిలేస్తుంది అన్నమాట. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు దీంతో కాంగ్రెస్ కు నష్టం ఏమీ లేకపోగా, టీజేఎస్ కు కూడా గౌరవప్రదమైన సీట్ల సంఖ్య సాధించామని తమ క్యాడర్ కు చెప్పుకునే అవకాశం లభిస్తుందట

ఒకప్పుడు ఉద్యమ నేతగా ఎంతో ఆదరణ పొందిన ప్రొఫెసర్ కోదండరాంకు పాపం ఎటువంటి దుస్థితి వచ్చింది అని ఆయన అభిమానులు బాధపడుతుండగా, తెలంగాణ ద్రోహి చంద్రబాబు పార్టీతో పొత్తుపెట్టుకోవడం ఏ విలువలకు నిదర్శనం అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

ఏకంగా చంద్రబాబుతోనే ప్రొఫెసర్ గారు నేరుగా సీట్ల బేరసారాలు చేస్తున్నరనే వార్త తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తొందరలోనే చంద్రబాబు చెప్పిన పాతబస్తీ ఫార్ములాతో మహాకూటమి  పొత్తులు ఖరారు అవుతాయి అని పరిశీలకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *