జీహెచ్ఎంసీలో పండుగ వాతావరణం..

  • February 11, 2019 4:27 pm

జీహెచ్ఎంసీ పాలకమండలి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ కు వలసలు పెరిగాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. హైదరాబాద్ కు స్వచ్ఛ సర్వేక్షన్ లో అవార్డు రావడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గతంలో జీహెచ్ఎంసీకి చెడ్డ పేరుండేది. ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. నగరాభివృద్ధికి అన్ని శాఖలు ప్రతి వారం సమన్వయం చేసుకుంటూ పోవాలని అన్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మూడేళ్ళలో జీహెచ్ఎంసీ బాగా పనిచేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ప్రశంసించారు. మారుమూల బస్తీల్లో కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధి పనుల్లో ఎన్నో అవార్డులను జీహెచ్ఎంసీ అందుకుంది. అధికారులు పనిచేసేలా సహకరించే ప్రభుత్వం తెలంగాణలో ఉందని దాన కిషోర్ ప్రశంసించారు.


Connect with us

Videos

MORE