“విజిట్ తెలంగాణ” ఫిల్మ్ కు బెస్ట్ ఆసియన్ ఫిల్మ్ అవార్డు

  • October 27, 2018 3:31 pm

యూరోప్ లోని పోర్చుగల్ లో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన “విజిట్ తెలంగాణ” ఫిల్మ్ కు ‘బెస్ట్ ఆసియన్ ఫిల్మ్ అవార్డు’ గెలుచుకుంది.

ఈ సందర్భంగా అవార్డు ను తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు. కార్యక్రమంలో ఫిల్మ్ మేకర్ దూలం సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ లో ఇండియా లోనే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మొదటిసారిగా ‘బెస్ట్ ఆసియన్ టూరిజం ఫిల్మ్’ అవార్డు సాదించిందన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ లో తెలంగాణ పర్యాటక శాఖ ‘బెస్ట్ లొకేషన్స్’ విభాగంలో ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ ను హైదరాబాద్ నగరంలో నిర్వహించటానికి టూరిజం ఫెస్టివల్ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. త్వరలో ‘అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్’ నిర్వాహకుల బృందం హైదరాబాద్ నగరంలో పర్యటించటానికి వస్తారని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.


Connect with us

Videos

MORE