టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా సంఘం మరియు జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో 23 సెప్టెంబరు 2017 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 650 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు. సంఘం ఆధ్వర్యంలో మరియు తెలంగాణ ఏర్పాటు తర్వాత నాలుగవ బతుకమ్మ కావడంతో అందరు కూడా పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల సమన్వయంతో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, కార్యదర్శి శ్రీమతి రాధిక బెజ్జంకి, కోషాధికారి శ్రీ సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ మల్లికార్జున్ మదపు, శ్రీమతి భారతి కైరొజు, శ్రీ మురళి కాందివనం, శ్రీ దమొదర్ రెడ్డి మాధి, ట్రస్టీ సభ్యులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, శ్రీ సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు శ్రీ చంద్ర స్వర్గం, శ్రీనాథ్ కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ హరి రావుల్ మరియు జాగృతి కెనడా ఉపాధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం, కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శోభారావు పీచర, జాగృతి ఎగ్జిగ్యూటివ్ కమీటీ సభ్యులు శ్రీ గౌతం కొల్లూరి మరియు శ్రీ ప్రభాకర్ తూము పాల్గొన్నారు.

బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయబద్ధంగా తయారు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

Related Articles

    None Found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *