బాల్కొండ మరో గోల్కొండ

  • September 27, 2018 12:20 pm

బాల్కొండ నియోజకవర్గం మరో గోల్కొండ ఖిల్లా లాంటిదని, ఎవరెన్ని ఎత్తులు వేసినా టీఆరెస్ ముందు చిత్తు కాక తప్పదని, వేల్పూరు మండలం లక్కోరలో జరిగిన సమావేశంలో నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాకు వున్న ప్రత్యేకతను ఆమె వివరించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు నిజామాబాద్ జిల్లాలోనే వున్నారని అన్నారు. అలాగే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి రాక కూడా పార్టీకి అదనంగా కలిసివచ్చే అంశం అన్నారు. ఆనాడు ఎంతో మంది రాజులు గోల్కండ కోటను వశపరచుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారో, అట్లనే టీఆరెస్ పార్టీని కూడా ఎవరూ ఓడించలేరని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక్కడి గ్రామాలకు కావలసిన సౌకర్యాల గురించి , రైతన్నల అవసరాలు, అభివృద్ధి ఎలా జరగాలో అనే విషయాల గురించి తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తూ, పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అనుచరులు 500 మంది ఎంపీ కవిత సమక్షంలో టీఆరెస్ లో చేరారు.


Connect with us

Videos

MORE