mt_logo

బరి తెగించిన నీటి దొంగలు! ఆంధ్ర రాష్ట్రం ఎడతెగని కృష్ణా నీటి దోపిడీ!

అడ్డగోలుగా, బ్యాక్ వాటర్స్ ఆధారంగా అని చెప్పి వంచనతో కృష్ణా నదిపై ఆ పోయిన రాజశేఖర్ రెడ్డి కట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ పాలిట శాపమైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఈ అక్రమ ప్రాజెక్టుకు నీళ్లిప్పిచ్చుకొని సక్రమం చేసుకున్నరు ఆంధ్రోళ్లు! అదే ఒక ప్రత్యేక కొట్లాటకు సరిపోయేంత పెద్ద విషయం!

ఇగ అన్నిటికన్నా పెద్ద అన్యాయమేందంటే కృష్ణా నది పారుకం ఎక్కువ 69 శాతం ఉన్న తెలంగాణకు తక్కువ శాతం 36.7 శాతం నీళ్లు కేటాయించుడు! బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కబ్జాల ఉండె కాబట్టి తెలంగాణ ప్రాంత హక్కులు పరిరక్షించేటోళ్లే లేకుంట పోయిండ్రు. అప్పట్ల తెలంగాణ రాజకీయ నాయకులు స్వీయ అస్తిత్వం లేక, వెన్నెముక లేక పదవులు, కులాల పేరిట రాజశేఖర్ రెడ్డి చేతుల కీలుబొమ్మల్లెక్క ఉంటుండ్రి. చెంచాగిరి చేస్తుండ్రి! ఇగ ఆంధ్ర పార్టీ తెలుగుదేశంల ఉన్నోళ్ల పరిస్థితి గూడ గంతే ఉండే! ఒక్కడు గూడ ఆంధ్రోళ్ళను ప్రశ్నించే పరిస్థితిల లేకుండ్రి! ఈ అడ్డగోలు నీటి పంపకాలకు శాస్త్రీయత లేదు! అంతర్రాష్ట్ర నీటి వాడుక సూత్రాలు పని చెయ్యవు!

ఇన్ని లంగతనాలే కాకుండా మల్ల దొంగల్లెక్క ఎక్కువ నీటిని తీసుకపోవుడు! ఇగ అది చాలదన్నట్టు ఉల్టా తెలంగాణోళ్లు ఎక్కువ నీళ్లు తీసుకపోయిండ్రు వాళ్లకు నీళ్లు బంద్ చెయ్యుండ్రని అడుగుడు! ప్రతి రోజూ ఇదే లొల్లి. ఇయ్యాల గూడ అదే నడుస్తున్నది! అక్రమంగా కట్టి దొడ్డి దారిన సక్రమం అని అనిపించుకున్న గా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీళ్లు కావాలంటే శ్రీశైలంల 854 అడుగుల ఎత్తు నీళ్లు ఉంచాలే, తెలంగాణను నీళ్లు తీస్కపోనియ్యద్దు! నీళ్ళెత్కపోవుడు మల్ల తెలంగోనోళ్లకు నీళ్లియ్యద్దనుడు! గిది లంగతనం కాకపొతే ఇంకేంది మరి?

మరి గిన్ని దొంగ సన్నాసి పనులు చేసేటోళ్లను లత్కోరోళ్ళు అంటరో, దొంగలంటరో, ఇంకేమనాల్నో జెర ఆలోచించుండ్రి! వీళ్ళను కేసీఆర్ ఎన్ని తిట్టినా మంచిగనిపిస్తది! తప్పే లేదు! ఇంకా ఎక్కువ తిట్టచ్చు.

ఇగ గిసుంటి ఆంధ్ర రాష్ట్రం పార్టీ టిడిపి తోటి కూటములు ఏర్పాటు చేసేటోళ్లను కూడ ఏమనాల్నో తెలుస్తలేదు! వాళ్ళ దోస్తానా వీళ్ళకెందుకు?

తెలంగాణ ఓటరు ఈ విషయం అర్థం చేసుకోవాలె! ఎవ్వడు ఆంధ్రా పార్టీ టిడిపి తోటి దోస్తానా చేసిండో వానికి మాత్రం ఓటెయ్యద్దు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *