ఆసరా పించన్ల పెంపు..

  • May 28, 2019 2:05 pm

ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పించన్లను రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన పించన్లు జూన్ నెల నుండి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు పెరిగిన పించన్లు జూలై నెలలో లబ్దిదారులకు చేరనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పించన్లు పెంచుతామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దివ్యాంగులకు రూ. 3,016, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ-ఎయిడ్స్ బాధితులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు ఇకపై రూ. 2,016 పించను అందనుంది.


Connect with us

Videos

MORE