మోగిన ఎన్నికల నగారా!!

  • March 11, 2019 11:31 am

సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 543 లోక్ సభ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 11న తొలివిడుత ఎన్నికలు ప్రారంభమై మే 19న జరిగే ఏడవ విడత ఎన్నికలతో సమరం ముగియనుంది. మే 23న జరిగే ఓట్ల లెక్కింపుతో రాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఏపీలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు తొలి విడుతలోనే అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 23 న జరగనుంది.


Connect with us

Videos

MORE