mt_logo

ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం.


తప్పు చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా కూడా ఎదురు దబాయించడం చంద్రబాబు నాయుడుకు, ఆయన పుత్ర రత్నం లోకేశ్ కు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా ఇదే దబాయింపు. మా ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారని. మాకూ పోలీసులు ఉన్నారు, మాకూ ఏసీబీ ఉంది అని పిచ్చి ప్రేలాపణలు పేలి చివరికి తట్టా బుట్టా సర్దేసుకుని కరకట్టకు జంపు అయ్యారు.

మళ్లీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ డేటాను తెలుగుదేశం పార్టీ అక్రమంగా చౌర్యం చేసిన కేసులో కూడా అదే అవకతవక ప్రవర్తనకు పాల్పడుతున్నాడు చంద్రబాబు.  

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల డేటాను ఐటీ గ్రిడ్స్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి చట్టవ్యతిరేకంగా ఇచ్చింది తెలుగు దేశం పార్టీ. ఐటీ గ్రిడ్స్ కంపెనీ తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కోసం సేవా మిత్ర అనే మొబైల్ యాప్ ను తయారుచేసింది. సదరు కంపెనీ ఆంధ్రలో ప్రభుత్వ లబ్దిదారుల డేటాను వాడి ఓటర్ లిస్టును ప్రభావితం చేస్తోంది అని, ఇట్లా ప్రభుత్వ డేటాను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వాడటం నేరం అని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఆఫీసుపై దాడి చేసి అక్కడున్న ప్రభుత్వ డేటాను స్వాధీనం చేసుకున్నారు.  

ఎఫ్.ఐ.ఆర్ చూస్తే స్పష్టంగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66, 72 కింద కేసులు నమోదుచేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

నిస్సిగ్గుగా ప్రభుత్వ డేటాను పార్టీ అవసరాలకు వాడుకోవడం, చట్టవిరుద్ధంగా ప్రజల ఆధార్ నెంబర్లతో సహా ఒక ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పడం వంటి నేరాలు చేసిన చంద్రబాబు ఎండ్ కో, ఇప్పుడు ఉల్టా తెలంగాణ ప్రభుత్వమే డేటా చౌర్యం చేసిందని తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు.

నేరం హైదరాబాదు కేంద్రంగా నడుస్తున్న ఐటీ కంపెనీ చేసింది, ఫిర్యాదు కూడా హైదరాబాదులో ఇచ్చారు కాబట్టే తెలంగాణ పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ఆ కంపెనీకే ఆంధ్రా పోలీసులను పంపించి, ఇప్పుడు అరెస్ట్ అయిన కంపెనీ ఉద్యోగి అదృశ్యం అయ్యాడని ఒక తప్పుడు కేసు పెట్టి, విషయాన్ని తప్పుదోవపట్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *