మహాకూటమి నేతలకు టైమ్‌ ఇచ్చిన కేసీఆర్‌… ఇక మిగిలింది ఫైనల్‌ బెల్‌…!!

  • November 6, 2018 10:53 am

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌… గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు.. ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్నా ఆయన కూల్‌గా పరిస్థితులను అంచనా వేస్తున్నారు.. ఇటీవల టీఆర్‌ఎస్‌ సభలను ఆయన తనయుడు, రాజకీయ వారసుడు కేటీఆర్‌ తన భుజాల మీద వేసుకొని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు, తర్వాత కేసీఆర్‌ కేవలం నాలుగంటే నాలుగే సభలను నిర్వహించారు. ఆ తరవాత ఆయన వ్యూహ రచనలోనే నిమగ్నం అయ్యారు. దీపావళి తర్వాత కేసీఆర్‌ బరిలోకి దూకుతారని తెలుస్తోంది..

దీపావళి తర్వాత మిగిలే 20 రోజుల సమయంలో కేసీఆర్‌ రోజుకి నాలుగు సభలు, అంటే మొత్తమ్మీద 75-90 సభలు నిర్వహించి సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. గత ఎన్నికలలో లాస్ట్‌ మినిట్‌లో ఆయన చేసిన ఈ తరహా ప్రచారమే కాంగ్రెస్‌ కొంపముంచింది. వారిని అధికారానికి దూరం చేసింది. ఈసారి కూడా తానే తెలంగాణ చాంపియన్‌ని అని ప్రూవ్‌ చేసుకోవడానికి కేసీఆర్‌ ఈ ఇరవై రోజులు విలువయిన సమయాన్ని వినియోగించుకోనున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు, కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ పొత్తుల ఎత్తులలోనే మునిగిపోయారు. ఇంకా బరిలోకి దిగలేదు. గ్రామానికో లీడర్‌, గల్లీకో కార్యకర్తగా ఉన్న కాంగ్రెస్‌లో ఎవరు ప్రచార భారాన్ని నిర్వహిస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. స్టార్‌ క్యాంపెయినర్‌గా బరిలోకి దిగిన రాములమ్మకు కేసీఆర్‌ని ఢీ కొట్టేంత సీన్‌ కానీ, ఇమేజ్‌ కానీ లేదు. ఇటు రవ్వంత రెడ్డిగా పేరు తెచ్చకున్న రేవంత్‌ రెడ్డి తనను తాను కేసీఆర్‌ అంతటి లీడర్‌గా ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. నియోజకవర్గానికి ఎక్కువ జిల్లాకు తక్కువ అయిన రేవంత్‌ రెడ్డి స్థాయికి కేటీఆరే ఎక్కువ..

ఈ వ్యవహారాలను పక్కనపెడితే మహాకూటమికి ఇన్ని రోజులు టైమ్‌ ఇచ్చినా ఇంకా యూజ్‌ చేసుకోలేదు. దీంతో, కేసీఆర్‌ త్వరలో జరపబోయే సుడిగాలి పర్యటనలలో వారు దుమ్ముకొట్టుకుపోవడం గ్యారంటీ అనే టాక్‌ వినిపిస్తోంది.. కేసీఆర్‌ తన అస్త్ర శస్త్రాలను అన్నింటినీ సిద్ధం చేసుకున్నాడట.. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నాడు. అన్ని నియోజకవర్గాలు, లీడర్‌లు, అపొజిషన్‌ పార్టీల అభ్యర్ధుల జాతకాలు, వారి చరిత్ర అంతా కేసీఆర్‌ దగ్గర ఉందట. వాటిని పక్కాగా అంచనా వేస్తున్న గులాబీ దళపతి, త్వరలోనే మరో దఫా ప్రచారంతో కాక పుట్టించబోతున్నారని సమాచారం. ఈ క్యాంపెయిన్‌తో మహాకూటమి నేతలకు ఫైనల్‌ బెల్‌ మోగడం గ్యారంటీ అని చెబుతున్నారు..


Connect with us

Videos

MORE